
వరుస ప్లాపుల తర్వాత ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) భావిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘కింగ్ డమ్’ (Kingdom). అన్ని పనులు పూర్తిచేసుకొని ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ రేట్లు పెంచాలని ఇటీవలే ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీంతో టికెట్ రేట్ల పెంపునకు (Kingdom Movie Ticket Rates) ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు నుంచి 10 రోజుల పాటు ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్ పై రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ ల్లో రూ.75 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు వీలు కల్పించింది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ నెల 25న ట్రైలర్!
మళ్లీ రావా, జెర్సీ వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) కింగ్ డమ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ఈ నెల జూలై 25న ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse), హీరోయిన్ గా నటిస్తుండగా, సత్యదేవ్ (Satyadev) కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు.
AP Hike Per Ticket As Per GO#Pushpa2 & #HariHaraVeeraMallu ₹100 ₹150 SS
₹200 Plexes#GameChanger ₹135 SS
₹175 Plexes#Devara ₹60 ₹110 SS
₹135 Plexes#Kalki2898AD ₹75 SS
₹125 Plexes#RRR ₹75#Kuberaa ₹75 For Higher Class Tickets#Kingdom & #HIT3 ₹50 SS
₹75 Plexes pic.twitter.com/AT0TCnwhuF— బహుదూరపు బాటసారి (@IamanMCA) July 24, 2025