‘భైరవం(Bhairavam)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) తర్వలో ‘కిష్కింధపురి(Kishkindhapuri)’ చిత్రంతో రాబోతున్నాడు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్ళపాటి(Kaushik Pegallapati) దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్(First Glimpse) రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విజయనగర సామ్రాజ్యం నేపథ్యంలో జరిగే ఒక ఆసక్తికరమైన కథను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సాహు గరపాటి(Sahu Garapaati) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ రివీల్ చేశారు.

గ్లింప్స్‌తో మూవీపై మరిన్ని అంచనాలు
ఇక ఇటీవల విడుదల గ్లింప్స్ వీడియోలో మంత్రాలతో మూసివేయబడిన ఒక పాత మహాల్(Old Mahal)లోకి హీరో కొంతమంది వ్యక్తులతో లోపలికి వెళ్తాడు. తర్వాత అక్కడ అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అవి మరింత ఉత్కంఠను పెంచే విధంగా ఉండటంతో గ్లింప్స్‌తో మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేశారు. దీంతో ‘కిష్కింధపురి’ సినిమా థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్
ప్రస్తుతం షూటింగ్(Shooting) శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ డేట్(Release Date) వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని, తెలుగు సినిమా ప్రియులకు ఒక కొత్త రకం థ్రిల్లర్ అనుభవాన్ని అందించనుందని సినీవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
September 12th Releasing pic.twitter.com/CwvLHe3rOg
— RR💥 (@rrking99) July 24, 2025






