టెక్స్‌టైల్(Texttiles) రంగంలోని స్మాల్ క్యాప్ కంపెనీ కర్ణికా ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Karnika Industries Ltd) తన షేర్‌హోల్డర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ బోర్డు ఇటీవల సమావేశమై, 1:4 రేషియోలో బోనస్ షేర్లను జారీ చేయాలని ఆమోదం తెలిపింది. అంటే, ఎవరి డీమ్యాట్ ఖాతాలో 1 ఈక్విటీ షేర్ ఉంటే వారికి అదనంగా 4 ఉచిత(Shares Free) షేర్లు లభిస్తాయి. ఈ షేర్లను పొందేందుకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు రికార్డు తేదీ త్వరలోనే ప్రకటించనుంది.
కంపెనీ ఈ అప్‌డేట్ ఇచ్చిన తర్వాత స్టాక్ ధర లాభాల్లోకి వెళ్లింది. గత సెషన్‌లో 4.14% నష్టంతో రూ.664 వద్ద ముగిసిన ఈ షేరు, నేటి ట్రేడింగ్‌లో రూ.655 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 3% పైగా పెరిగి రూ.692 వరకు చేరింది. ప్రస్తుతం షేరు రూ.677 వద్ద 2% లాభంతో ట్రేడవుతోంది.
కర్ణికా స్టాక్ 52 వారాల గరిష్ఠం రూ.723, కనిష్ఠం రూ.228గా ఉంది. గత 6 నెలల్లో ఈ స్టాక్ 68% రిటర్న్ ఇచ్చింది. గత ఏడాదిలో 109% లాభంతో మల్టీబ్యాగర్‌గా నిలిచింది. ఐదు సంవత్సరాల్లో దీనిపై పెట్టుబడి వేసిన వారికి 720% లాభం లభించింది. అంటే, అప్పట్లో రూ.1 లక్ష పెట్టినవారు ఇప్పుడు రూ.8.2 లక్షలకుపైగా సంపాదించి ఉండొచ్చు.
ఇప్పుడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.859 కోట్లకు పైగా ఉంది. బోనస్ షేర్ల నిర్ణయం ఈ షేరుపై మరింత ఆసక్తిని పెంచే అవకాశముంది. ఇప్పటికే లాంగ్‌టెర్మ్ రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్ పై మరింత దృష్టి పెట్టేందుకు ఇది సరైన సమయం కావొచ్చు.






