చిరంజీవితో స్టెప్పులేయనున్న క్రేజీ బ్యూటీ.. విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ స్టార్ట్!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి ప్రేక్షకులను తన పెర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చిరు, ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడితో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

విశ్వంభర( Vishwambhara) సినిమాకు దర్శకుడిగా వశిష్ట వ్యవహరిస్తున్నారు. ‘బింబిసార’ సినిమాతో హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు చిరుతో కలిసి ఈ భారీ సొషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో, షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఇటీవల మేకర్స్ వరుసగా పోస్టర్లు విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా విశ్వంభర షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. శుక్రవారం నుంచి ఫైనల్ షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య స్టెప్పులు వేయిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో దీనికి ఓ మాస్ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు. మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, “విశ్వంభర చివరి షెడ్యూల్ ఓ అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరు స్టైల్‌, ఎనర్జీతో ప్రేక్షకులకు ఇది ఓ స్పెషల్ ట్రీట్ కానుంది,” అని పేర్కొన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి ఫ్యాన్స్‌, సినీ ప్రేక్షకులంతా విశ్వంభర రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజా అప్డేట్ ప్రకారం, విశ్వంభర సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ స్టెప్పులేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు.

‘నాగిని’ సీరియల్ ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్, అనంతరం బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా, ‘కేజీఎఫ్: చాప్టర్ 1’లో స్పెషల్ సాంగ్‌ చేస్తూ సౌత్ ఆడియన్స్‌లో కూడా ఫేమ్ సంపాదించింది. ఇప్పుడు విశ్వంభరలో మెగాస్టార్ సరసన ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈ జోడి స్క్రీన్‌పై కనువిందు చేయడం ఖాయం అని అభిమానులు ఆశిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *