Ashoka Gajapati Raju: గోవా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అశోక్ గజపతి రాజు

విజయనగరం సంస్థానాధీశుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు(Pusapati Ashoka Gajapati Raju) గోవా గవర్నర్‌(Goa Governor)గా ప్రమాణస్వీకారం(swearing in) చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే(Bombay High Court Chief Justice Alok Aradhe) శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్‌ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు శుక్రవారం కుటుంబ సభ్యులతో గోవా చేరుకున్న ఆయన, రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నేడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్‌(Nara Lokesh), సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు TDP ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం

కాగా అశోక్ గజపతి రాజు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఏడుసార్లు MLAగా, ఒకసారి MPగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 25 ఏళ్లు, 13 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు. గవర్నర్ నియామకాన్ని రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకం ఉత్తరాంధ్రకు గర్వకారణంగా నిలిచింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *