ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్(Haridwar temple)లో ఆదివారం (జులై 27) మానస దేవి ఆలయంలో ఘోర తొక్కిసలాట(stampede) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 9:30 గంటల సమయంలో ఆలయానికి వెళ్లే సిమెంటు మెట్ల మార్గంలో జరిగింది. శ్రావణ మాసం(Sravana Maasam)లో భక్తుల భారీ రద్దీ కారణంగా ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయ మార్గంలో ఒక విద్యుత్ తీగలో కరెంటు ఉందనే వదంతి భక్తులలో భయాందోళనలకు దారితీసింది. ఈ గందరగోళంలో కొందరు భక్తులు(Devotees) వెనుకకు తిరిగి వెళ్లే ప్రయత్నంలో రద్దీ మరింత పెరిగి తొక్కిసలాటకు దారితీసింది.
![]()
సీఎం పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి
ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రుకి తరలించారు, అయితే ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే నిర్ధారించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ, రెండు కిలోమీటర్ల ఆలయ మార్గంలో రద్దీ కారణంగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ(CM Pushkar Singh Dhami) ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (SDRF), పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
#HaridwarStampede
6 killed & many injured during a stampede which was triggered by a rumour of electric shock 100 M down the temple route police is investigating
The injured are taken to the local hospital 🏥
Being Sunday there was a huge crowd
Courtesy @ANI @IndiaToday pic.twitter.com/KaT2oW2RL6— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) July 27, 2025






