
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) కలిసి నటిస్తున్న మూవీ ‘కింగ్డమ్’(Kingdom). మళ్లీ రావా, జెర్సీ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వం వహించారు. జులై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది.
అన్నదమ్ముల మధ్య ఉండే బంధాన్ని తెలుపుతూ ‘గోడమీద ఉన్న దేవుడా.. నా గుండెల్లో ఉన్న నా అన్న’ అని సాగే పాటను మూవీ టీమ్ ఇప్పటికే రిలీజ్ చేశారు. తాజాగా ఇప్పుడు మరో సాంగ్‌ను విడుదల చేశారు. ‘రగిలే రగిలే’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను మంగళవారం రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కింగ్ డమ్ మూవీని నిర్మించారు. మూవీలో విజయ్ దేవరకొండకు అన్నగా సత్యదేవ్ (Satyadev) నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందించారు.