Prabhas: రాజాసాబ్‌ నుంచి సంజయ్ దత్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “రాజాసాబ్”(Raja Saab) ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేకర్స్ ఈరోజు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt) లుక్‌(Powerful Look )ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా నటిస్తున్నాడు, కాగా ఆయన పాత్ర పేరు “సంజూబాబా” అని పోస్టర్ ద్వారా వెల్లడించారు.

సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ఆయన భారీ గడ్డం, పొడవైన జుట్టుతో స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్ చూసిన వెంటనే ఇది పాత్రకు ఎంత హైలైట్ అవుతుందో అర్థమవుతుంది.

ఇప్పటికే ప్రభాస్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు సంజయ్ దత్ క్యారెక్టర్ పోస్టర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఓ భిన్నమైన జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *