Thammudu: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ ‘తమ్ముడు’ మూవీ

నితిన్(Nitin) హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు(Thammudu). తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. ఇవాళ్టి (ఆగస్టు 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌(Streaming on OTT)కు అవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్(Director Venu Sriram) దర్శకత్వం వహించారు. MCA, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన వేణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావించారు. కానీ ఈ మూవీ ఆయనకు భారీ నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో లయ(Laya), సప్తమి గౌడ(Saptami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), శ్వాసిక విజయ్, సౌరభ్ సచ్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీ జులై 4న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Thammudu review. Thammudu Telugu movie review, story, rating -  IndiaGlitz.com

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

అక్కా-తమ్ముడి సెంటిమెంట్‌(Brother-sister sentiment)తో రూపొందిన ఈ చిత్రంలో నితిన్, లయ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్(Boxoffice) వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. డిజాస్టర్ టాక్‌తో కనీస కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయిన ఈ మూవీ, నితిన్ ఖాతాలో మరో ఫ్లాఫ్‌ను అందించింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్(Netflix) ఈ చిత్రం ఓటీటీ హక్కులను సొంతం చేసుకొని, ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్‌కు చేస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అజనీష్ లోక్‌నాథ్(Ajanish Loknath) మ్యూజిక్ అందించిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఓటీటీలో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓటీటీలో ఈ మూవీ చేసేయండి..

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *