తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న బొమ్మరిల్లు సిద్ధార్థ్(Siddharth) తాజాగా నటించిన చిత్రం “3BHK”. శరత్ కుమార్(Sharath Kumar)తో కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కుటుంబ కథా చిత్రం జూలై 4న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.
ఈ చిత్రంలో దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర ఆచార్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించగా, దర్శకుడు మిస్కిన్ శిష్యుడు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు అమృత్ రామ్‌నాథ్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(OTT Release)లోకి వచ్చేసింది. ఈ రోజు(Aujust1) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amezon Prime Video), సింప్లీ సౌత్(Simply South) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు తమిళంలో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయినవారు ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చూడొచ్చు. ఇంటిబంధాలు, భావోద్వేగాలతో నడిచే ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కావడంతో, కుటుంబసభ్యులతో కలసి చూడదగ్గ చిత్రం. మీరు మిస్సవకుండా చూసేయండి!
Feel Good Movie ❤️✨ #3BHK (Tamil + Telugu ) Now streaming on PrimeVideo (India) 🍿!!#OTT_Trackers pic.twitter.com/jrO7BcyH4L
— OTT Trackers (@OTT_Trackers) August 1, 2025






