Rdhika: నటి రాధికకు అస్వస్థత.. మూడు రోజులుగా ఆస్పత్రిలోనే.. ఫొటోస్ వైరల్

సినీ, టీవీ రంగాల్లో విశేషమైన గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల జూలై 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ఇది సాధారణ జ్వరమని భావించినా, వైద్య పరీక్షల అనంతరం ఆమెకు డెంగ్యూ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాధికకు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. వైద్యుల సూచన మేరకు ఆమె పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉండనున్నారు. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, ఒక్కసారిగా సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ వార్తపై స్పందించిన సినీ ప్రముఖులు, అభిమానులు #GetWellSoonRaadhika అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *