గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించారు. జయపూర్ణ దాస్ రచనతో విష్ణువు నరసింహ అవతార కథను అద్భుత విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 3D ఫార్మాట్లో విడుదలైన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా సంచలన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

రూ.100 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది
మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు(Gross Collections) వసూలు చేసిన ఈ మూవీ.. ఐదు రోజుల్లో రూ.30 కోట్లు, ఆరు రోజుల్లో రూ.42 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.10.95 కోట్లు, హిందీలో రూ.30.10 కోట్ల నెట్ కలెక్షన్లతో రికార్డులను బద్దలు కొట్టింది. రూ. దాదాపు రూ.15కోట్ల బడ్జెట్(Budget)తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా లాభాలను ఆర్జించి రూ.100 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది.
![]()
ప్రహ్లాదుడి(Prahlad) భక్తి, హిరణ్యకశిపుడి(Hiranyakashipu) దుర్మార్గం, నరసింహ అవతార ఘట్టాలను భావోద్వేగంతో కూడిన కథనంతో, అద్భుతమైన యానిమేషన్(Animation)తో చిత్రీకరించిన ఈ మూవీ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సామ్ CS సంగీతం, ఎపిక్ విజువల్స్‌తో కూడిన క్లైమాక్స్(Climax) సన్నివేశాలు థియేటర్లలో విజిల్స్‌ను రాగిల్చాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి చిత్రంగా, ఈ సినిమా భారతీయ యానిమేషన్‌కు కొత్త ఒరవడిని సృష్టించింది.






