
గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు(Gold Rates) భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 1,530 పెరిగింది. వెండి(Silver) దాదాపు కూడా బంగారం బాటలోనే పయణించింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రూ. 1,23,000గా ఉంది. హైదరాబాద్(hyderabad)లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.1,013, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,290 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,400 పెరిగింది. దీంతో రూ.92,900 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,530 పెరిగింది. దీంతో రూ. 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖ పట్నంలో రేట్లు ఎలా ఉన్నాయంటే..
విజయవాడ(Vijayawada), విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,23,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,13,000 వద్ద ట్రేడ్ అవుతోంది.