అనుష్క శెట్టి(Anushka Shetty), విక్రమ్ ప్రభు(Vikram Prabhu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఘాటీ(Ghaati). జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ మూవీ నిర్మిస్తున్నారు. జులైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా(Postponed release) పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలొస్తున్నాయి. VFX వర్క్, మరింత శ్రద్ధ పెట్టి, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని టీం ప్లాన్ చేస్తోంది. నవంబరులో అయితే మరిన్ని థియేటర్స్ కూడా దొరకుతాయని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం లభిస్తుందని కూడా చిత్రయూనిట్ ఆలో చిస్తోందట. అయితే ఈ విషయంపై అధి కారిక సమాచారం అందాల్సి ఉంది.

పాస్-ఇండియా స్థాయిలో రిలీజ్
కాగా ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాస్ ఇండియా(Pan-India) స్థాయిలో రిలీజ్ కానుంది. ఒకప్పుడు అమాయకురాలైన మహిళ అనుకోని పరిస్థితులు, చేదు అనుభవాల కారణంగా ఎలా ఒక క్రూరమైన గంజాయి స్మగ్లింగ్(Ganja Smuggling)రాణిగా మారిందనేది ఈ సినిమా కథాంశం. “విక్టిమ్, క్రిమినల్, లెజెండ్” అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాకు సౌత్ ఇండియాలో రికార్డు ధరగా చెబుతున్నారు. అనుష్క “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Ghaati fan made edits >>>>>>>>#AnushkaShetty #Ghaati
👑💥❤️ pic.twitter.com/8Bha5R4ynr— Sai (@SaiAnushkafan) August 3, 2025






