తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu film industry)లో కార్మికుల వేతనాల పెంపుపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా కార్మికుల వేతనాల(Film workers’ salaries)ను 30 శాతం పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు నిర్మాతల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇవాళ్టి (ఆగస్టు 4) నుంచి సినిమా, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్, టీవీ ప్రోగ్రామ్‌ల షూటింగ్(Shootings)లను నిలిపివేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం రేకెత్తించింది.
ప్రతి మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు
ఫెడరేషన్ ప్రకారం, ప్రతి మూడేళ్లకోసారి 30 శాతం వేతన పెంపు నిబంధన జూన్ 30తో ముగిసింది. అయినప్పటికీ, నిర్మాతలు(Producers) ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. వేతన పెంపును రాతపూర్వకంగా అంగీకరించిన నిర్మాతల షూటింగ్‌లకు మాత్రమే కార్మికులు హాజరవుతారని, లేనిపక్షంలో షూటింగ్‌లలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం టాలీవుడ్(Tollywood)లోని అనేక ప్రాజెక్టులపై ప్రభావం చూపనుంది.అయితే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ డిమాండ్‌కు సమాధానంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
యూనియన్ మెంబర్‌షిప్ అవసరం లేకుండా
నైపుణ్యం కలిగిన కార్మికులకు యూనియన్ మెంబర్‌షిప్ అవసరం లేకుండా నిర్మాతలు వారిని నేరుగా నియమించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం నిర్మాతల శ్రేయస్సు, చిత్ర పరిశ్రమ మనుగడ కోసమని ఛాంబర్ పేర్కొంది. ఈ రెండు నిర్ణయాలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆందోళనలో ఉన్నారు.
Sensational Decision
Taken by #TFCC 👇
Telugu Film Chamber of Commerce
Union Federation Vs Producers
Let’s see how far this will go 🤔#Tollywood #TeluguFilmIndustry pic.twitter.com/aCARDowkDN
— Alluri Suresh Varma (@sureshvarmaz) August 4, 2025






