భాగ్ మిల్కా భాగ్ (Bhaag Milka Bhaag), జిందగీ న మిలేంగి దొబారా, లక్ష్య వంటి స్టోరీ ప్రాధాన్యత మూవీల్లో నటించి మెప్పించారు బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar). చాలా గ్యాప్ తర్వాత ఆయన లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న మూవీ ‘120 బహదూర్’ (120 Bahadur). 1962 ఇండియా-చైనా యుద్ధం నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో డైరెక్టర్ రజనీష్ తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి (PVC) జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే మూవీ టీజర్ ను టీమ్ మంగళవారం రిలీజ్ చేసింది.
నవంబరు 21న రిలీజ్
మేజర్ షైతాన్ సింగ్ భాటియాగా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. ‘చైనాతో యుద్ధానికి మేమంతా సిద్ధమయ్యాం. మైనస్ 24 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలిని లెక్కచేయకుండా ఓ మేజర్ ధీమాగా ఉన్నారు. చది కాదు.. ఆయనలో మంటల చెలరేగుతున్నట్లు అనిపించింది’ సాగిన వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నవంబరు 21న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు టీజర్ లో వెల్లడించారు. ఫైట్స్, విజువల్స్, సంభాషణలతో మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్న టీజర్ ను (120 Bahadur Teaser) మీరూ చూసేయండి.






