ఉత్తరాంధ్రలో బుర్రకథల(Burrakatha) ద్వారా పేరు పొందిన గరివిడి లక్ష్మి(Garividi Lakshmi) జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్స్ మీడియా బ్యానర్(People’s Media Banner)పై తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన గ్లింప్స్(Glimpse)కు మంచి స్పందన రావడంతో తాజాగా చిత్ర బృందం ఫేమస్ సాంగ్ ‘నల జీలకర్ర మొగ్గ’ వీడియో(Nala Jilakara Mogga Video) సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియా(Social Media) వేదికగా ఇప్పటికే వైరల్ అవుతోంది. ముఖ్యంగా కథానాయిక ఆనంది చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఆమె నటన, హావభావాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాగ్ మయూర్(Rag Mayur)తో కలిసి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జమ్ము నాయుడు(Jammu Naidu) దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జానపదతనం, సంప్రదాయాల మేళవింపుతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్లజిలకర్ర మొగ్గ సాంగ్‌ని మీరూ చూసేయండి..






