డైనోసార్ల(Dinosaurs ) ఆధారంగా రూపొందిన జురాసిక్ పార్క్(Jurassic park) సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన అభిమానం ఉంది. భారతదేశంలోనూ ఈ సిరీస్‌కు ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ కాదు. జురాసిక్ పార్క్ పేరుతో ఇప్పటివరకు పలు సూపర్‌హిట్ సినిమాలు విడుదల కాగా, అవన్నీ భారీ కలెక్షన్లను సాధించాయి.
ఈ సిరీస్‌లోనే ఇటీవల విడుదలైన తాజా చిత్రం ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’(Jurassic World: Rebirth), 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్ కు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూలై 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, గత సినిమాలకి కొంత భిన్నంగా ఉన్నా, ఆడియెన్స్‌ను ఆకట్టుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది. భారతదేశంలోనూ ఈ సినిమాకు భారీ స్పందన లభించింది.
విడుదలైన నెల రోజులకే ఈ చిత్రం, ఏలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) , ఆపిల్ ప్లస్(apple Plus) ప్లాట్‌ఫామ్స్‌లో వీడియో ఆన్ డిమాండ్ (వీవీఓడీ) విధానంలో (అద్దెకు) అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది ఉచిత స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది.
ఈ హాలీవుడ్ చిత్రానికి గరెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించగా, స్క్రీన్‌ప్లేను డేవిడ్ కోప్ అందించారు. ప్రముఖ నటి స్కార్లెట్ జోహాన్సన్ ప్రధాన పాత్ర పోషించగా, ఆడ్రినా మిరాండా, ఎడ్ స్క్రెయిన్, జొనాథన్ బెయిలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో విడుదల అయ్యింది. ఇండియా, చైనా, కొరియా, యూకే, నార్త్ అమెరికా, మలేషియా, బ్రెజిల్ లాంటి కీలక దేశాల్లో భారీ రిలీజ్ సాధించింది. విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి, వరల్డ్ వైడ్‌గా $105 మిలియన్ డాలర్లు (సుమారుగా ₹9,000 కోట్లు) వసూలు చేసినట్లు డెడ్‌లైన్ వెబ్‌సైట్ పేర్కొంది.






