ప్రముఖ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మకు (Kapil Sharma) సంబంధించిన కెనడాలోని రెస్టారెంట్‌పై దుండుగులు మరోసారి కాల్పులు జరిపారు. గత నెలలోనూ అతడి రెస్టారెంట్ పై కొందరు కాల్పులకు తెగబడ్డారు. తమ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా డ్రెస్సింగ్ పై వ్యాఖ్యలు చేసినందుకు ప్రతీకారంగా తామే కాల్పులు జరిపినట్టు బీకేఐ ఉగ్రవాద సంస్థ సభ్యుడు ప్రకటించారు. చేశాడు. సర్రేలోని కప్స్ కేఫ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు 25 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. నెల రోజుల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. అయితే ఈసారి కారణం సల్మాన్ ఖాన్ అని దుండగులు పేర్కొన్నారు.
డైరెక్టర్లు, నిర్మాతలు, నటులను చంపేస్తా..
బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను కపిల్ తన షోకు ఆహ్వానించినందుకే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్రూప్ కు చెందిన హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ ఆడియోను రికార్డ్ చేశాడు. సల్మాన్ ఖాన్ తో పనిచేసే డైరెక్టర్లు, నిర్మాతలు, నటులను చంపేస్తానంటూ అతడు హెచ్చరించాడు. ‘కపిల్ శర్మకు చెందిన రెస్టారెంట్లో ఇటీవల, ఇప్పుడు కాల్పులు జరిగాయి. నెటిక్స్ షోకి సల్మాన్ ఖాన్‌ను ఆహ్వానించడమే అందుకు కారణం’ అని ఇంగ్లీష్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
Surrey, Canada 🇨🇦: #KapilSharma’s cafe attacked again—2nd time in a month!
Repeated gunfire incidents expose Canada’s worsening law & order and rising extremism.#Canada must crack down on such elements before it spirals further.@CanadianPM
#KapilSharma #KapsCafe pic.twitter.com/07hFA8rw6E
— Shivani dhillon (@shivani_Dhllon) August 8, 2025






