Mahesh Babu’s Athadu: నేడు మహేశ్ బాబు బర్త్ డే.. ఐకానిక్ మూవీ ‘అతడు’ రీరిలీజ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఈరోజు (ఆగస్టు 9) ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) అయింది. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సందర్భంగా థియేటర్లలో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ సందడి చేస్తున్నారు. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. జయభేరి ఆర్ట్స్(Jayabheri Arts) బ్యానర్‌పై నిర్మాత మురళీమోహన్(Murali Mohan) రూపొందించిన ‘అతడు’, అప్పట్లో థియేటర్‌లలో పెద్దగా ఆడకపోయినా, టెలివిజన్‌లో రికార్డు టీఆర్పీ రేటింగ్‌లతో అభిమానుల మనసు గెలుచుకుంది. మహేశ్ బాబు స్టైలిష్ లుక్, త్రిష(Trisha)తో కెమిస్ట్రీ, త్రివిక్రమ్ సంభాషణలు, మణిశర్మ సంగీతం, బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.

Athadu - Hotstar

మహేశ్, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే ‘అతడు’ సీక్వెల్

ఈ రీ-రిలీజ్ కోసం టెక్నాలజీ పరంగా మూవీని 4K వెర్షన్‌లోకి అప్‌డేట్ చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు గత నెల 30న మహేశ్ బాబు యూట్యూబ్ ఛానల్‌లో రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా.. అభిమానుల్లో హైప్‌ను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల అయింది. ‘అతడు’లో మహేశ్ బాబు నటనకు నంది అవార్డు లభించింది. కాగా ఈ మూవీపై ఇటీవల నిర్మాత, నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, మహేశ్, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే ‘అతడు’ సీక్వెల్ తీసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ రీ-రిలీజ్‌తో మహేశ్ బాబు అభిమానులకు థియేటర్లలో మరోసారి సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *