రాఖీ పండగ(Rakhi Festival) సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు(Gold Rates) దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. గతకొంత కాలంగా రూ. లక్షకు పైగా నమోదవుతూ వస్తున్న పుత్తడి రేట్లు సగటు మధ్యతరగతి వాడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం శ్రావణ మాసం కావడం, పండుగలు, శుభాకార్యాలకు ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో గోల్డ్ రేట్లు, వెండి ధరలు (Silver Price) హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 9) మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

ఇక ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో(Hyderabad bullion market) పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.270 తగ్గి రూ.1,03,040కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.250 తగ్గి రూ.94,450 వద్ద నమోదవుతోంది. సిల్వర్ రేట్లలో ఈరోజు ఏమాత్రం మార్పు లేకుండా.. కేజీకి రూ.1,27,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్(Hyederabad, విశాఖపట్నం, విజయవాడల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.






