Shiva Movie: 4K విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో నాగ్ ‘శివ’ రీరిలీజ్

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా, రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో 1989లో విడుదలైన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ(Shiva)’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రీ-రిలీజ్(Re-Release) చేయనున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ‘శివ’ 36 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

Watch Siva (1989) (Telugu) Full HD Movie Online on ZEE5

ఆగస్టు 14 నుంచి ‘కూలీ’ సినిమాలో ‘శివ ట్రైలర్’

ఈ సినిమా నాగార్జునకు ఐకానిక్ హీరో స్థాయిని తెచ్చిపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. “మోస్ట్ ఐకానిక్ మూవీ ‘శివ’ని 4K డాల్బీ అట్మాస్‌లో తీసుకొస్తున్నాం. ఆగస్టు 14 నుంచి ‘కూలీ(Coolie)’ సినిమా థియేటర్లలో ‘శివ’ ట్రైలర్(Shiva Trailer) ప్రదర్శించనున్నాం” అని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ కూడా, “చైన్ ఈజ్ బ్యాక్! డాల్బీ అట్మాస్‌లో నాగ్ పంచ్ మరింత బిగ్గరగా వినిపిస్తుంది” అంటూ ఉత్సాహం వ్యక్తం చేశారు. నాగార్జున, అమల(Amala), రఘువరన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ సంభాషణల రచయిత (తనికెళ్ల భరణి) విభాగాల్లో మూడు నంది అవార్డులను గెలుచుకుంది.

సెప్టెంబర్ రెండో వారంలో రీ-రిలీజ్ అయ్యే ఛాన్స్

అభిమానులు ఎప్పటి నుంచో ‘శివ’ 4K రీ-రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీ(AI Technology)తో మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కు మార్చారు, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో రీ-రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మళ్లీ ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *