Param Sundari: సిద్ధార్థ్-జాన్వీ రొమాంటిక్ కామెడీ ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశారా?

బాలీవుడ్ యువ నటులు జాన్వీ కపూర్(Janvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి(Param Sundari)’ ట్రైలర్ ఈరోజు (ఆగస్టు 12) విడుదలైంది. తుషార్ జలోటా(Tushar Jalota) దర్శకత్వంలో మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్(Dinesh Vision) నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్(Trailer) విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌లో జాన్వీ కపూర్ కేరళ అమ్మాయిగా, సిద్ధార్థ్ మల్హోత్రా ఢిల్లీ యువకుడిగా కనిపించారు. ఉత్తర, దక్షిణ భారత సంస్కృతుల మధ్య ప్రేమకథ(Lovestory)గా ఈ చిత్రం రూపొందింది. భాష, ఆచారాలలో భిన్నత్వంతో జరిగే వినోదభరిత సన్నివేశాలు, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ట్రైలర్‌ను ఆకట్టుకునేలా చేశాయి.

Film Buzz: Sidharth Malhotra & Janhvi Kapoor Shine in 'Param Sundari'  Trailer

జాన్వీ-సిద్ధార్థ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌

జాన్వీ కపూర్ రజనీకాంత్(Rajinikanth), అల్లు అర్జున్(Allu Arjun), మోహన్‌లాల్‌లను ఇమిటేట్ చేసిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. కేరళలోని అందమైన లొకేషన్స్, విజువల్స్, జాన్వీ-సిద్ధార్థ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి.సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై ఉత్కంఠను పెంచింది. జాన్వీ కపూర్ ‘దేవర(Devara)’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై, ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘పెద్ది(Peddi)’లో నటిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌తోపాటు పాన్-ఇండియా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *