War-2: ఏపీలో వార్2 టికెట్ల రేట్ల పెంపు.. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన తారక్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ జూ ఎన్టీఆర్(Jr NTR) కాంబోలో రూపొందిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్(Trailer), పాటలు ఇప్పటికే అభిమానులను ఆకర్షించాయి. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించి టికెట్ రేట్ల(Ticket Rates)పై ఏపీ సర్కార్(AP Govt) మేకర్స్‌కు శుభవార్త అందించింది. ‘వార్ 2’ చిత్రానికి టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర ₹220, సెకండ్ క్లాస్ టికెట్ ₹150గా ఉండనుంది. అలాగే ఒక అదనపు షో కేటాయించడం ద్వారా చిత్రం బాక్సాఫీస్ వసూళ్లను పెంచుకునే అవకాశం కల్పించింది.

War 2 Trailer: Hrithik Roshan, Jr NTR Clash In Ayan Mukerji's Explosive  Action Saga, Kiara Advani Shines Beyond Glamour | Bollywood - Times Now

ఏపీ ప్రభుత్వానికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు

ఈ నిర్ణయంపై హీరో జూ ఎన్టీఆర్(NTR) సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని(AP Govt)కి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతా(SM)లో ట్వీట్ చేస్తూ, “వార్ 2 విడుదల సమయంలో టికెట్ రేట్ల పెంపునకు జీవో జారీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

రజినీకాంత్ ‘కూలీ’ని ఢీకొట్టనున్న వార్-2

కాగా ‘వార్ 2’ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) నిర్మించింది. ఈ చిత్రం భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకోనుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి కనిపించడం ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఈ చిత్రం రజినీకాంత్ నటించిన ‘కూలీ(Coolie)’తో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనుంది. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలతో రెండు చిత్రాలు భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *