రాజస్థాన్(Rajasthan)లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో 11 మంది భక్తులు మరణించారు. ఈ దుర్ఘటనలో 7 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఖాటు శ్యామ్ ఆలయం(Khatu Shyam Temple)లో దర్శనం ముగించుకుని ఉత్తరప్రదేశ్(UP)లోని ఇటావా జిల్లాకు చెందిన భక్తులు పికప్ వ్యాన్‌లో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దౌసా-మనోహర్పూర్ హైవేపై బాపీ గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ నిలిచిన ట్రక్కును ఢీకొట్టింది.
20 మందికి పైగా గాయపడ్డారు: SP
ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు, వీరిలో 7-8 మంది తీవ్రంగా గాయపడినవారిని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (SMS) ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని దౌసా జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాగర్ రానా(SP Rana) మాట్లాడుతూ, “ఖాటు శ్యామ్ ఆలయం నుంచి తిరిగి వస్తున్న భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం 11 మంది మరణించినట్లు సమాచారం వచ్చింది” అని తెలిపారు.
#WATCH | Dausa, Rajasthan | On accident between a passenger pick up and trailer truck near Bapi, Dausa Dy SP Ravi Prakash Sharma says, “A total of 11 people have died. This includes four children and seven women… One woman died after reaching SMS Hospital, where she was… https://t.co/uW5wgSE6aF pic.twitter.com/37bg69QsIA
— ANI (@ANI) August 13, 2025
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంతాపం
దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రమాదం తీవ్రతను ధృవీకరిస్తూ, గాయపడినవారికి వెంటనే వైద్య సహాయం అందించినట్లు చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడినవారికి తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయవిదారక సంఘటన ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొనేలా చేసింది.






