బ్యాంకు లాకర్లో బంగారం పోతే.. బ్యాంకు బాధ్యత వహిస్తుందా? పూర్తి వివరాలు ఇవే

బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఒక ప్రముఖ బ్యాంకులో లాకర్ సదుపాయం తీసుకుంది. అందులో 145 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలను ఉంచింది. ఒక రోజు లాకర్ తెరిచినప్పుడు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసింది. తిరిగి సరిగా వెతికితే అవి లాకర్ అడుగున దొరికాయి. ఈ సంఘటనతో ఒకవేళ నిజంగానే బ్యాంకు లాకర్‌లో బంగారు ఆభరణాలు పోతే, బ్యాంకు ఎంతవరకు బాధ్యత వహిస్తుందో తెలుసుకుందాం.

లాకర్ చట్టాలు, RBI మార్గదర్శకాలు

బ్యాంకు లాకర్లు(Bank Locker) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాలు, బ్యాంకు నియమాల ప్రకారమే పనిచేస్తాయి. 2021లో RBI కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. లాకర్‌లో ఉన్న వస్తువుల వివరాలు బ్యాంకు నమోదు చేయకూడదు. కస్టమర్ ఏమి ఉంచాడో అడిగే హక్కు బ్యాంకుకు లేదు. అయితే దొంగతనం, మోసం, లేదా బ్యాంకు నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల లాకర్లోని వస్తువులు పోతే, బ్యాంకే బాధ్యత(Bank Responsible) వహించాలి.

పరిహారం ఎలా ఉంటుంది?

బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగితే, బ్యాంకు సంవత్సర లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు సంవత్సరానికి రూ. 3,౦౦౦ లాకర్ అద్దె చెల్లిస్తుంటే, గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. అయితే ఈ మొత్తం బంగారం లేదా వజ్రాల విలువకు సరిపోకపోవచ్చు.

బ్యాంకు ఎప్పుడు బాధ్యత వహించదు?

భూకంపాలు, వరదలు, తుఫానులు వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే బ్యాంకుకు బాధ్యత ఉండదు. కస్టమర్ నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగినా, కస్టమర్ తాళం పోగొట్టుకుంన్న బ్యాంకు బాధ్యత వహించదు. అదనంగా, బ్యాంకులు లాకర్‌లోని వస్తువులకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వవు, కాబట్టి వ్యక్తిగత ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

బ్యాంకు లాకర్లలో ఎంత భద్రత ఉంటుంది?

లాకర్‌ను తెరవడానికి రెండు తాళం చెవులు అవసరం. ఒకటి కస్టమర్ దగ్గర ఉంటుంది, మరొకటి బ్యాంకు అధికారి దగ్గర ఉంటుంది. ఈ రెండూ కలిస్తేనే లాకర్ తెరుచుకుంటుంది. లాకర్ గది మొత్తం నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. అలాగే, లాకర్ గదికి ప్రవేశం పరిమితంగా ఉంటుంది. లాకర్లను ఉంచే గదులు సాధారణంగా ఇనుము లేదా స్టీల్‌తో తయారు చేసిన అత్యంత పటిష్టమైన గదులు (Vaults) ఉంటాయి. మొత్తానికి, బ్యాంకు లాకర్లు భద్రత కల్పించినా, పూర్తి రిస్క్ ఫ్రీ కావు. కాబట్టి లాకర్ ఉపయోగించే వారు RBI నిబంధనలు, పరిహారం పరిమితి, భద్రతా చర్యలను ముందుగానే తెలుసుకోవాలి.

ముఖ్య గమనిక: లాకర్‌లో వస్తువులు పోయినప్పుడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ తర్వాత బ్యాంకుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం. దర్యాప్తు తర్వాతే పరిహారంపై నిర్ణయం ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *