ఈ ఆగస్టు 14న విడుదలైన రెండు భారీ చిత్రాలు ‘వార్ 2(War2)’, ‘కూలీ(Coolie)’ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) నటించిన ‘వార్ 2’ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా, రజనీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు OTTలోకి రాబోతున్నాయని ఓ న్యూస్ సినీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ‘వార్ 2’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్(Netflix) భారీ ధరకు సొంతం చేసుకుందట. థియేట్రికల్ రన్ తర్వాత సాధారణంగా 8 వారాల గ్యాప్‌తో ఓటీటీలో విడుదల అవుతుందని ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కూలీ’
దీని ప్రకారం, ‘వార్ 2’ అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే, థియేటర్‌లో సినిమా ప్రదర్శన ఆధారంగా ఈ తేదీ కొంత మారవచ్చు. నెట్‌ఫ్లిక్స్ త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. మరోవైపు, ‘కూలీ’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో సినిమా ఫలితం ఆధారంగా ఈ తేదీ కూడా మారే అవకాశం ఉంది.

‘కూలీ’లో రజనీకాంత్‌తో పాటు నాగార్జున(Nagarajuna), శృతి హాసన్, ఉపేంద్ర(Upendra) వంటి స్టార్ కాస్ట్ ఉండటం దీని ఆకర్షణను మరింత పెంచింది.ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌లో యావరేజ్ రెస్పాన్స్‌ను సాధించినప్పటికీ, ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కెమిస్ట్రీ, ‘కూలీ’లో రజనీకాంత్ మాస్ యాక్షన్ ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.
#war2 How much it need to collect to enter into profits ? also rights for Telugu version across all over or else only in Telugu states for all languages ? Will ott and digital rights of Telugu version belong to Vamsi ? publicity cost is separate right ? Can any one explain plz. https://t.co/9QlebOLvbE
— kinneresh moduga TVK (@kinnereshnaidu) August 16, 2025






