తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఒక్క సినిమాతోనే స్టార్డమ్ సంపాదించారు. అదేవిదంగా కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమైపోయారు. అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఆ అందాల తారలు అకస్మాత్తుగా మాయమవ్వడం సినీప్రియులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మరోసారి ఆ హీరోయిన్స్ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ అభిమానుల ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు పంజాబీ బ్యూటీ సమీక్ష(Sameksha).
2004లో దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 143 చిత్రంలో సమీక్ష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీతోనే సమీక్ష అందం, అమాయకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతను కట్టిపడేసింది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన దడ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. అలాగే బ్రహ్మానందం డ్రామా కంపెనీ, కులుమనాలి, ఇదండీ సంగతి వంటి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ, ఆమెకు మళ్లీ మొదటి స్థాయిలో బ్రేక్ రాలేదు.
తెలుగు మాత్రమే కాకుండా సమీక్ష హిందీ, కన్నడ, తమిళం, పంజాబీ భాషలలో కూడా సినిమాలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో వెండితెరకు దూరమైంది. 2020లో సింగపూర్‌కు చెందిన ప్రముఖ గాయకుడు(Famous Singer) షేల్ ఓస్వాల్(Shael Oswal) ను సమీక్ష వివాహం(She Married) చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి పలు చిత్రాలను నిర్మించింది.
View this post on Instagram
ప్రస్తుతం సమీక్ష సినిమాలు ఎక్కువగా చేయకపోయినా, పలు వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన ఫ్యామిలీ ఫోటోలు, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ పాత జ్ఞాపకాలను మళ్లీ తెస్తున్నాయి.






