Elvish Yadav: బిగ్‌బాస్ విన్నర్, ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ ఇంటిపై కాల్పులు

ప్రముఖ యూట్యూబర్(Youtuber), గాయకుడు, బిగ్ బాస్ OTT 2 (Hindi) విజేత అయిన ఎల్విష్ యాదవ్(Elvish Yadav) గురించి సుపరిచితమే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ(wild card entry) ద్వారా హౌస్‌లోకి ప్రవేశించి.. బిగ్ బాస్(Bigg Boss) OTT 2 చరిత్రలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా విజయం సాధించాడు. అతని కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి. ఈ విజయంతో అతనికి సోషల్ మీడియా(Social Media)లో మరింత గుర్తింపు లభించింది. ఎల్విష్ యాదవ్ యూట్యూబ్‌తోనే బాగా ఫేమ్ దక్కించుకున్నాడు.

కాల్పులు జరిపి పరార్

‘ఎల్విష్ యాదవ్’ అండ్ ‘సిస్టమ్’ అనే రెండు చానెల్స్ బాగా గుర్తింపు పొందాయి. అయితే ఈరోజు (ఆగస్టు 17) తెల్లవారుజామున 5.30 గంటలకు గుర్తు తెలియని దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని యూట్యూబర్ ఇంటి వద్దకు ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి 24 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఎల్విష్ ఇంటి వద్దకు వచ్చి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరుగలేదని తెలుస్తోంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *