బాలీవుడ్లో రామాయణం(Ramayana) ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, వాల్మీకి రామాయణాన్ని ఆధునిక సాంకేతికతతో గ్రాండ్‌గా ఆవిష్కరించనుంది. అమితాబ్ బచ్చన్ దశరథుడి(Dasharatha) పాత్రలో నటిస్తారని సమాచారం. ఈ పాత్ర రామాయణంలో కీలకం కాబట్టి అమితాబ్ వంటి అనుభవజ్ఞుడైన నటుడు ఈ పాత్రకు న్యాయం చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రెండు భాగాలుగా రామాయణం
అమితాబ్ బచ్చన్‌తో పాటు, ఈ చిత్రంలో ఇతర ప్రముఖ నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తారని సమాచారం. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందనుంది. మొదటి భాగం 2026లో విడుదల కానుంది. 2027 దీపావళికి రెండో పార్ట్ రానుంది. హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు, గొప్ప నిర్మాణ విలువలతో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. అమితాబ్ బచ్చన్ ఇటీవల శ్రీరామనవమి (Sriramanavami) సందర్భంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో రామాయణ కథకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Amitabh Bachchan In Talks To Be Epic Narrator of Nitesh Tiwari’s Ramayana, In Addition To Voicing Jatayu
Read: https://t.co/19YV6LAxID#AmitabhBachchan #NiteshTiwari #Ramayana #RanbirKapoor #SaiPallavi #Yash @SrBachchan @niteshtiwari22 pic.twitter.com/GKYwlDRpyQ
— Box Office Worldwide (@BOWorldwide) August 19, 2025






