తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ‘మిరాయ్(Mirai)’ మరోసారి వాయిదా పడింది. యువ నటుడు తేజా సజ్జ(Teja Sajja) హీరోగా, కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా(Postpone) పడుతూ ఆడియన్స్‌ను నిరుత్సాహపరుస్తుంది. ఇక షూటింగ్ పనులు పూర్తి కాగా.. ఎట్టకేలకు ఈ మూవీ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Confirmed !! #TejaSajja‘s #Mirai release postponed from Sep 5th to Sep 12th. pic.twitter.com/quZtWAC04i
— IndiaGlitz Telugu™ (@igtelugu) August 19, 2025
అనుష్క మూవీ అడ్డురావడంతోనే..
అదే రోజున అనుష్క (Anushka) ఘాటీ(Ghaati) సినిమా రిలీజ్ ఉండటంతో.. మిరాయ్‌ని వాయిదా వెయ్యాలని ఫిక్స్ అయ్యారట మూవీ టీమ్. ఈ మేరకు సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాను వాయిదా వేస్తూ.. సెప్టెంబర్ 12కు పోస్ట్ పోన్ చేసినట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై టీమ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ (Official Announcement) ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రంలో రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్గా నటిస్తుండగా.. మంచు మనోజ్(Manchu Manoj) విలన్‌గా మెప్పించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్(TG Vishwaprasad) గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.






