భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు(Monsoon Sessions of Parliament) వాడీవేడి చర్చలు, నిరసనల మధ్య ముగిశాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఈ సమావేశాలు అనేక కీలక అంశాలపై తీవ్ర చర్చలకు వేదికగా నిలిచాయి. సమావేశాలు 120 గంటలు జరగాల్సి ఉండగా, అంతరాయాల కారణంగా కేవలం 37 గంటలు మాత్రమే కొనసాగాయి. ఈ సమయంలో అనేక బిల్లులు ఆమోదం పొందాయి, అయితే విపక్షాల నిరసనలు సభలో అంతరాయాలకు దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించగా, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రభుత్వం భారత పైలట్ల సామర్థ్యాన్ని తక్కువ చేసిందని ఆరోపించారు.
వికసిత్-2040 భారత్ దిశగా అడుగులు
బిహార్ ఎన్నికల(Bihar Elections) ముందు ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండీ కూటమి(INDI Alliance) పార్లమెంటు లోపల, బయట నిరసనలు చేపట్టింది. వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)పై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది, దీనిని రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగం వికసిత భారత్ దిశగా దార్శనికతను ఆవిష్కరించిందని మోదీ ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణలు, మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై రాష్ట్రపతి ప్రసంగం దృష్టి సారించింది.

ఈ సమావేశాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు ఇవే..
☛ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
☛ ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ అంశంపై లోక్సభలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
☛ బిహార్ ఎన్నికల ముందు చేపట్టిన SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు లోపల, బయట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది.
☛ ‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025’కి ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆన్లైన్లో డబ్బుతో ఆడే ఆటలను, వాటి ప్రకటనలను నిషేధిస్తుంది. మరోవైపు, తీవ్రమైన నేరారోపణలపై 30 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రధానులు, CMలు, మంత్రులు రాజీనామా చేయాలని నిర్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టారు.
☛ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA, INDI కూటములు రెండూ దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులనే బరిలోకి దింపాయి. ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan), ఇండీ కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి(Justice B.Sudarshan Reddy) పోటీలో నిలిచారు.
☛ విపక్షాలు ప్రణాళిక ప్రకారమే సభా కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టించాయని స్పీకర్ ఓం బిర్లా(OM Birla) విమర్శించారు. మొత్తం 120 గంటలు జరగాల్సిన సభ కేవలం 37 గంటలు మాత్రమే పనిచేసిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో లోక్సభ 12, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి.
🚨 BREAKING NEWS
Monsoon Session of Parliament adjourned SINE DIE.
— Lok Sabha: Worked just 37 hrs out of 120 , only 31% productivity.
— Only 37 hrs spent on key issues.— One of the LEAST productive sessions in recent years.#parliamentmonsoonsession2025 pic.twitter.com/AqY0buRS1a
— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) August 21, 2025






