మన దేశంలో మనీ కూడా లేని వ్యాల్యూ గోల్డ్(Gold)కు ఉంటుందనేది కాదనలేని నిజం. ఎందుకంటే భారత సంస్కృతి, సంప్రదాయాల్లో పుత్తడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ ఫెస్టివల్(Festival) అయినా, ఏ స్పెషల్ అకేషన్ అయినా మహిళలకు బంగారు ఆభరణాలు ధరించేందుకే మొగ్గుచూపుతారు. మరోవైపు ఇటీవల కాలంలో పురుషులు కూడా బంగారం ధరిస్తున్నారు. ధర(Price) ఎంత పెరుగుతున్నా.. దానికున్న డిమాండ్(Gold Demand) మాత్రం తగ్గడం లేదు. తోటివారికి 10 తులాలు ఉన్నా మాకు కనీసం 2 తులాలైనా ఉండొద్దా అని సాధారణ మధ్యతరగతి మహిళలు సైతం అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇక ఈరోజు (ఆగస్టు 22) తెలుగు రాష్ట్రాల్లో(Telugu States)నూ బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా. హైదరాబాద్(Hyd) బులియన్ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220 తగ్గి రూ.1,00,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 పతనమై రూ.92,150 పలుకుతోంది. అటు KG వెండి ధరపై రూ.2,000 పెరిగి రూ.1,28,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనుండగా.. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. ఇక డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపీ వ్యాల్యూ(Rupee Value) రూ.87.28వద్ద కొనసాగుతోంది.






