దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల(CM)పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక (Association for Democratic Reforms Report 2025) వెలువరించింది. ఇందులో దేశంలోని 30 మంది సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులు(Criminal Cases), విద్యార్హతల వివరాలు వెల్లడించింది. ఈ మేరకు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu naidu) రూ.931 కోట్ల ఆస్తులతో టాప్లో నిలిచారు. ఆయన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు, భార్య భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి.
Chandrababu Naidu Richest CM – ₹931 crore
Mamata Banerjee Poorest CM – ₹15 lakh
इसी लिए दीदी को ED वालों की कोई परवाह नहीँ है ! pic.twitter.com/G0HNX9VwpV— Raj Kumar (@Rajkdigimark) August 22, 2025
అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా మమతా బెనర్జీ
ఇక రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ (రూ.332 కోట్లు), మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య (రూ.51.93 కోట్లు) ఉన్నారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (రూ.15 లక్షలు) నిలిచారు. 30 మంది సీఎంల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది. ఇది దేశ సగటు తలసరి ఆదాయం (రూ.1.85 లక్షలు) కంటే 7.3 రెట్లు ఎక్కువ. కాగా మణిపుర్లో రాష్ట్రపతి పాలన కారణంగా ప్రస్తుతం అక్కడ సీఎం పదవిలో లేడు.
10 మంది సీఎంలపై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు
ఇదిలా ఉండగా అత్యధిక క్రిమినల్ కేసుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy) అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనపై 89 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 72 తీవ్రమైన నేరాలకు సంబంధించినవి. రెండో స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (47 కేసులు), మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు (19 కేసులు) ఉన్నారు. మొత్తం 30 మంది సీఎంలలో 13 మందిపై (42%) క్రిమినల్ కేసులు, 10 మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
Based on ADR’s Dec 2024 report, top 10 CMs with most declared criminal cases:
1. Revanth Reddy (Telangana) – 89 (one quashed Aug 2025, possibly 88 now)
2. M.K. Stalin (Tamil Nadu) – 47
3. Chandrababu Naidu (Andhra Pradesh) – 19
4. Siddaramaiah (Karnataka) – 13
5. Hemant Soren…— Grok (@grok) August 22, 2025
సీఎంలలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవే..
ఇక ఎక్కువ చదువుకున్న సీఎంలు జాబితాలో డాక్టరేట్లు ఇద్దరు, పోస్టు గ్రాడ్యుయేట్లు 8 మంది, గ్రాడ్యుయేట్ ప్రొఫేషనల్స్ ఆరుగురు, గ్రాడ్యుయేట్లు 9 మంది, 12th పాస్ ముగ్గురు, 10th పాస్ ఇద్దరు, డిప్లొమా ఒకరు పూర్తి చేశారు. ఎన్నికల సమయంల్లో వీరు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ పేర్కొంది.






