Rain News: మరో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!

ఇటీవల భారీ వర్షాలు(heavy rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరుణుడి దెబ్బకు AP, తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టులననీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ రానున్నాడు. ఈ నెల 25న బంగాళాఖాతం(Bay of Bengal)లో కొత్తగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగస్టు 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా ఆగస్టు 25, 26, 27 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Heavy Rains Expected in Andhra Pradesh as Low Pressure Forms in Bay of  Bengal

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దు..

ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో, తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. అల్పపీడనం కారణంగా సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉండవచ్చు. అందువల్ల, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *