US Open 2025: నేటి నుంచి యూఎస్ ఓపెన్.. బరిలో స్టార్ ప్లేయర్లు

అమెరికాలోని న్యూయార్క్‌లో నేటి (ఆగస్టు 24) నుంచి యూఎస్ ఓపెన్(US Open-2025) ప్రారంభం కానుంది. ఈ బిగ్ టెన్నిస్ టోర్నీ సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. 15 రోజుల పాటు జరిగే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌(Grand Slam tournament)లో ప్రపంచ స్థాయి స్టార్ ఆటగాళ్లు బరిలో దిగుతున్నారు. ముఖ్యంగా నొవాక్ జొకోవిచ్(Novak Djokovic), అల్కరాజ్(Carlos Alcaraz) వంటి స్టార్ ప్లేయర్లు అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్-1 జానిక్ సిన్నర్(Janic Sinner) తన రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ కోసం పోటీపడుతున్నాడు. అతను తొలి రౌండ్‌లో చెక్ ఆటగాడు విట్ కోప్రివాతో తలపడనున్నాడు. రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్, 2022 ఛాంపియన్, అమెరికన్ ఆటగాడు రీల్లీ ఓపెల్కాతో ఆడనున్నాడు.

Image

ఈసారి గట్టి పోటీ తప్పదా?

ఇక నాలుగు సార్లు ఈ టైటిల్ గెలిచిన నోవాక్ జొకోవిచ్, ఏడో సీడ్‌గా, యువ అమెరికన్ ఆటగాడు లెర్నర్ టీన్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లు రసవత్తరంగా ఉండనున్నాయి, ముఖ్యంగా అల్కరాజ్, జొకోవిచ్ సెమీఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది. అమెరికన్ ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, బెన్ షెల్టన్ కూడా ఈ సారి గట్టి పోటీ ఇవ్వనున్నారు. అటు మహిళల సింగిల్స్‌(Women’s Singles)లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్యనా సబలెంకా(Aryana Sabalenka) తన రెండో టైటిల్ కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన రెబెకా మసరోవాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇగా స్వియాటెక్, కోకో గాఫ్, జెస్సికా పెగులా వంటి స్టార్ ఆటగాళ్లు కూడా టైటిల్ రేసులో ఉన్నారు.

బరిలో వీనస్ విలియమ్స్

స్వియాటెక్ ఇటీవల వింబుల్డన్(Wimbledon), సిన్సినాటి ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 2021 ఛాంపియన్ ఎమ్మా రాడుకాను, రెండు సార్లు గెలిచిన వీనస్ విలియమ్స్(Venus Williams) 45 ఏళ్ల వయసులో కూడా ఈ టోర్నమెంట్‌లో ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందులో సిన్నర్, గాఫ్ వంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 90 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో, ఈసారి యూఎస్ ఓపెన్ అభిమానులను ఉర్రూతలూగించనుంది.

Venus wows in WTA comeback match, at 45 | Tennis News - Hindustan Times

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *