Jatadhara: ‘సితార’ పోస్టర్‌తో క్యూరియాసిటి పెంచేసిన సుధీర్ బాబు ‘జటాధర’

టాలీవుడ్‌(Tollywood)లో కొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘జటాధర(Jatadhara)’. హీరో సుధీర్ బాబు(Sudheer Babu), దర్శకుడు వెంకట్ కళ్యాణ్(Director Venkat Kalyan) కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా సితార పోస్టర్(Sitara Poster) రిలీజ్ అయింది. ఈ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ చిత్రం భారతీయ పౌరాణిక కథలను ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌(VFX)తో మేళవించి తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రంలో సుధీర్ బాబు యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) హీరోయిన్‌గా నటిస్తోంది.

Sudheer Babu's Jatadhara Set For Mahashivratri 2025 Release; New Poster  Unveils His Enigmatic Avatar

డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీ

డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌(First Look Poster)ను షేర్ చేశారు. ఇందులో యంగ్ బ్యూటీ దివ్యా ఖోస్లా కుమార్(Divya Khosla Kumar) ‘సితార’ పాత్రలో నటిస్తోంది. ఇక విడుదలైన పోస్టర్‌లో లంగాఓణీలో గార్జియస్ లుక్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందులో ‘‘శిథిలావస్థలో.. సితార విశ్వాసాన్ని కనుకొంది’’ అని పోస్టర్ రాసి ఉండటం సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar), రైన్ అంజలి, దివ్య విజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *