కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన స్వయం దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్-1’(Kantara Chapter-1) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్స్‌లోకి రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఓకేసారి ఏడు భాషల్లో విడుదల
కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ‘కాంతార చాప్టర్-1’ తెలుగు రైట్స్(Telugu Rights)ను దాదాపు రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. నైజాం ప్రాంతానికి రూ.40 కోట్లు, ఆంధ్రకు రూ. 45 కోట్లు, సీడెడ్‌కు రూ.15 కోట్లుగా ధర నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ భారీ డీల్ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. మొదటి భాగం కంటెంట్‌తో అన్ని భాషల్లో ఆకట్టుకోవడంతో, ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Pedha amount a edhi…!
[ news3people, Kantara chapter 1, Rishab shetty ] pic.twitter.com/34gVmOcpnl— NEWS3PEOPLE (@news3people) August 23, 2025
భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో..
ఈ సినిమా కోసం రూ.120 కోట్ల బడ్జెట్‌తో రిషబ్ శెట్టి భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా సైతం మంచి సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. అయితే, ఈ మూవీకి రూ.100 కోట్ల రైట్స్ ధరపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కంటెంట్ ఆధారిత చిత్రానికి ఇంత భారీ డీల్ అవసరమా అనే చర్చ కూడా సాగుతోంది.






