తమిళ స్టార్ నటుడు, దళపతి విజయ్(Thalapathy Vijay) ఇటీవల మధురైలో భారీ బహిరంగ సభ(A huge public meeting) ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో ఒక కోటి 40లక్షల మంది (14M) ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. విజయ్ ఇన్ స్టాలో షేర్ చేసిన రీల్ రికార్డులు బద్ధలు కొడుతోంది. మూడు రోజుల క్రితం మధురైలో జరిగిన తమిళగ వెట్రి కజగం (TVK) రెండవ రాష్ట్ర స్థాయి సమావేశం గ్రాండ్ సక్సెసైంది. అభిమానుల సముద్రంతో సెల్ఫీ(Selfie) తీసి విజయ్ దీనిని షేర్ చేయగా, మాస్ ఫ్యాన్స్ లో ఈ వీడియో అగ్గి రాజేసింది.
ఒకే ఒక్క పోస్ట్‌కు అత్యధిక లైక్‌లు
విజయ్ పోస్ట్‌కు ఒక రోజులోనే కోటి పైగా లైక్‌లు రావడం ఆసక్తిని కలిగించింది. సుమారు కోటి 40 లక్షల మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో విజయ్‌ని అనుసరించడం ఆసక్తికరం. ఏ దక్షిణ భారత నటుడికి సాధ్యం కాని రికార్డ్ ఇన్‌స్టాలో నమోదైంది. ఒకే ఒక్క పోస్ట్‌కు అత్యధిక లైక్‌లు (10.3 మిలియన్లు) సాధించిన నాయకుడిగా రికార్డులు బ్రేక్ చేశాడు విజయ్.
100M Views for A Instagram Reel
@actorvijay 💥🔥This is Insane ❤️
GOAT Thalapathy Vijay#TVKVettriMaanadu #TVKMaduraiMaanadu #ThalapathyVijay pic.twitter.com/PjMRXe6Ysq
— NerdyGirl (@BlossomNerdy) August 24, 2025
2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
విజయ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా, సినీకెరీర్‌ని విడిచిపెట్టలేదు. అతడు తదుపరి `జన నాయగన్(Jana Nayagan)` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నటనకు వీడ్కోలు పలికి 2026 వేసవిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక(Tamilnadu Assembly Elections)ల్లో పోటీ చేయడం కోసం సర్వసన్నాహకాల్లో ఉన్నాడు. అతడి రాజకీయ సమావేశాలకు ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. మరి సినీఇండస్ట్రీలో తనకంటో ఓ ట్రెండ్ సెట్ చేసుకున్న దళపతి.. పాలిటిక్స్‌లో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
That song in Thalapathy Voice 😍
”Unga VIJAY Uyirena Varren Naa” 🔥 pic.twitter.com/WB6ULdnm2d
— Krrish (@ItzKrrish_) August 21, 2025






