Telangana Govt: గణేశ్, దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్

తెలంగాణ(Telangana)లో పండుగల వేళ, రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్(Ganesh Mandapam), దుర్గామాత మండపాల(Durga Matha Mandapam)కు ఉచితంగా విద్యుత్ సరఫరా(Free Electricity) చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, అయితే నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది ఉండాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాహకులు హర్షం

ఈ నెల 27వ తేదీ నుంచి గణేశ్ చతుర్థి ఉత్సవాలు(Ganesh Chaturthi celebrations) ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Mahaganpati) విగ్రహ నిర్మాణ పనులు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ప్రకటించడంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *