టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్(Kingdom)’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) తెరకెక్కించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్గా నటించింది. అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో సత్యదేవ్(Satyadev) కీలక పాత్ర పోషించారు. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ నెల రోజులు పూర్తి కాకముందే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్(Netflix)లో రేపటి (ఆగస్టు 27) నుంచి తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది.
In the kingdom of gold, blood and fire… a new king rises from the ashes 🤴🔥 pic.twitter.com/MWHBYavB0q
— Netflix India (@NetflixIndia) August 25, 2025
నాలుగు వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ శక్తిమంతమైన నటన, దర్శకుడి వినూత్న కథనం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం మిశ్రమ ఆదరణ పొందింది. ముఖ్యంగా యువ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సాధారణంగా, థియేటర్లో విడుదల తర్వాత సినిమాలు OTTలోకి రావడానికి 6-8 వారాల సమయం పడుతుంది. అయితే, ‘కింగ్డమ్’ కేవలం నాలుగు వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవడం విశేషం. ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో, థియేటర్లకు వెళ్లలేని ప్రేక్షకులకు ఇంటి నుంచే ‘కింగ్డమ్’ను ఆస్వాదించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






