కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వచ్చేసింది. ఇప్పటికే విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగస్టు 29) నుంచి 12వ సీజన్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. తెలుగు టైటాన్స్(Telugu Titans), పట్నా పైరేట్స్, యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్, దబంగ్ దిల్లీ, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్, హరియాణా స్టీలర్స్, జైపుర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్, యు ముంబా పుణేరి పల్టాన్ జట్లు కప్పు కోసం తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మేరకు 12వ సీజన్ నేటి నుంచి విశాఖపట్నం(Vizag)లో ఉత్కంఠభరితంగా ఆరంభం కానుంది.
12 జట్లు లీగ్ దశలో 108 మ్యాచులు
కాగా 12 జట్లు లీగ్ దశలో 108 మ్యాచుల్లో పోటీపడనున్నాయి. తొలి రోజు రెండు ఉత్కంఠభరిత మ్యాచులతో సీజన్ షురూ కానుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్(Telugu Titans vs Tamil Thalaivas)తో తలపడనుండగా, రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్(Bangalore Bulls vs Puneri Paltan)తో పోటీపడనుంది. విశాఖపట్నంతో పాటు జైపూర్, చెన్నై, ఢిల్లీలలో కూడా మ్యాచులు జరగనున్నాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ 1/తెలుగు ఛానెల్లోనూ, జియో హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకులు వీక్షించవచ్చు.
మ్యాచ్ టై అయితే ప్రత్యేక నిబంధనలతో..
విశాఖపట్నం(Vizag)లో జరిగే ఈ మ్యాచులు స్థానిక క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని, సందడిని అందించనున్నాయి. ప్రస్తుత సీజన్లో మ్యాచ్ టై అయితే ప్రత్యేక నిబంధనలతో 5 రెయిడ్ల షూటౌట్‌ను నిర్వహిస్తారు. అప్పుడు కూడా రెండు జట్లు సమంగా ఉంటే గోల్డెన్ రెయిడ్(Golden Raid) విజేతను నిర్ణయిస్తుంది. అప్పటికీ ఫలితం తేలకపోతే టాస్(Toss) ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. లీగ్ దశలో టాప్-8లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ ఆడతాయి.
Pro Kabaddi Season 12 – Opening Day Clash 🔥 in Vizag
Match 1 Southern Derby – Telugu Titans vs Tamil Thalaivas
Match 2 Bengaluru Bulls vs Puneri PaltanWhich team are you supporting in today’s Matches 👀🔥
Follow @kabaddilovers__ #kabaddi #kabaddilovers #prokabaddi pic.twitter.com/8bV6M8BmT8
— Kabaddi Lovers (@kabaddilovers__) August 29, 2025






