Devara: దేవర ఓపెనింగ్ సాంగ్ ముస్తాబు.. పూనకాలు పక్కా

ManaEnadu:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) హీరోగా, కొరటాల శివ(korata shiva) డైరెక్షన్‌లో వస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ దేవర(Devara). ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటీ జాన్వీ(janvi) కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు(Ratnavelu) ట్విటర్‌లో ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. సెట్‌లో దిగిన ఫొటో షేర్‌ చేశారు.

దీనికి ‘ఈ చిత్రంలోని ఓపెనింగ్‌ సాంగ్‌ షూట్‌ చేస్తున్నాం. అద్భుతమైన విజువల్స్‌.. అనిరుధ్‌ మ్యూజిక్‌తో సూపర్‌గా రెడీ అవుతోంది. డ్యాన్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రేస్‌, స్టైల్‌ మామూలుగా లేవు. ఫాన్స్‌కు పూనకాలు పక్కా. మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది’ అని రాసుకొచ్చారు. కాగా ఈ సాంగ్‌కు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. రత్నవేలు పోస్ట్‌తో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా మూవీ టీమ్ సినిమాలోని ఫైట్ సీన్‌కు సంబంధించి ఆయుధ ఫొటోను షేర్ చేసింది.

ఎన్టీఆర్-జాన్వీ సాంగ్.. యూట్యూబ్ షేక్

ఇదిలా ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ‘‘చుట్టమల్లె’’ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో దాదాపు 70 వేలకుపైగా మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది.
పక్కా రొమాంటిక్ మూడ్‌లో వచ్చిన ఈ సాంగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా కుదిరిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తన గ్లామర్‌తో జాన్వీ యూత్ తెగ ఆకట్టుకుంది. సాంగ్ మ్యూజిక్, లిరిక్స్, లోకేషన్స్, విజువల్స్ అన్నీ అదిరిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్(anirudh) తన మ్యాజిక్ ఏంటో మరోసారి చూపించాడు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దేవర’ పార్ట్‌ 1 సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. రోజు రోజుకీ అభిమానుల్లో హైప్ పెంచుతున్న దేవర.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తోంది చూడాలి.

https://www.youtube.com/watch?v=bQ_VGlq8rns

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *