Mana Enadu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్స్ రాక చాలా రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త టీటౌన్లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ శంకర్. భారతీయుడు-2 మూవీ కొలాప్స్ తర్వాత గేమ్ ఛేంజర్‌పై శంకర్ మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెకిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్‌తో ఆడియన్స్‌ను అలరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైనా ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.
క్రిస్మస్ కానుకగా వచ్చే అవకాశం
అయితే గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ షర వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల ఎప్పుడనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఓ వార్త సినీ టౌన్లో తెగ వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ వాయిదా పడుతుందని వాస్తున్న వార్తల నేపథ్యంలో ఈ కొత్త న్యూస్ చెర్రీ ఫ్యాన్స్‌కు ఊరటనిస్తోంది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కారణంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కీలకపాత్రల్లో స్టార్ నటులు
మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే ఆగాల్సిందే. ఈ మూవీలో డజన్ల కొద్దీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ వంటి భారీ స్టార్స్ ఉన్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్






