DEEKSHA: భీముడి పాత్ర‌ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది ..దీక్ష మూవీ రిలీజ్ అప్పుడే

ManaEnadu:ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌(Pratani Ramakrishna Goud)స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’(DEEKSHA ). పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు.

 ‘దీక్ష’(DEEKSHA )సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. “దీక్ష” ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించిన‌ట్లు చెప్పారు. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుందని డైర‌క్ట‌ర్ రామకృష్ణ గౌడ్ అన్నారు. భీముడి గెటప్ లో ఆయన చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుందన్నారు.. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుందని వివ‌రించారు.‘దీక్ష’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహిళా కబడ్డీ సినిమాను లాంఛ్ చేస్తాం. త్వరలో జరగనున్న తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల్లో సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. అన్నారు

హీరో కిరణ్ మాట్లాడుతూ – ‘దీక్ష’ మూవీలో హీరోగా నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ అన్నగారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమానే కాదు ఆయన నెక్ట్ మూవీ మహిళా కబడ్డీలోనూ నాకు నటించే అవకాశం ఇచ్చారు.

నటి అక్సాఖాన్ (Aqsa Khan)మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంతో పాటు 18 భాషల్లో వస్తున్న మహిళా కబడ్డి మూవీలోనూ ఆర్కే గౌడ్ గారు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో దీక్ష చిత్రబృందం అలైఖ్య‌రెడ్డి, అనూష‌, తుల‌సి పాల్గొని కావేరి చిత్ర నిర్మాత షేక్ అల్లాబక్షు, కావేరి చిత్రబృందం పాల్గొని దీక్ష సినిమా టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *