NBK 50 YEARS: అఖండ నట శిఖరం.. వేడుకగా బాలయ్య 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవం

Mana Enadu: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)… ఈ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్‌లో ఒక వైబ్రేషన్ వస్తుంది. ‘జై బాలయ్య’ అనే నినాదం… వారిలోని ఎనర్జీని రెట్టింపు చేస్తుంది. నట సార్వభౌముడు నందమూరి Taraka Ramarao వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఇక అప్పటి నుంచి తన సినీ జీవితంలోను, Political జీవితంలోనూ ఏనాడూ వెనుతిరిగి చూసుకోలేదు. నటుడిగా ఆయన 50 ఏళ్లు (50 Years) పూర్తి చేసుకున్నారు. హీరోగా కొన్నేళ్లు కొనసాగడమే కష్టమైతే… ఇన్నేళ్లుగా బాలయ్య హీరోగా కొనసాగుతూనే ఉండటం ఆయన స్టార్ డమ్‌( Stardum)కు నిదర్శనం. తాజాగా బాలయ్య 50 ఏళ్ల గోల్డెన్ సెలబ్రేషన్స్ (Golden Celebrations) హైదరాబాద్‌లోని నోవాటెల్​లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు TELANGANA CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బాలయ్య నటజీవితాన్ని ఆయన కొనియాడారు. ఒక యాక్టర్‌గా, సమాజసేవకుడిగా ఆయన సేవలు అభినందనీయమన్నారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, Telugu cine Industryలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. మరోవైపు ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీలోని అన్ని వర్గాల ప్రముఖులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరయ్యారు.

హాజరైన ప్రముఖులు వీరే

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Mega star Chiranjeevi), త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్(Rajanikanth), మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి, క‌న్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్, అక్కినేని నాగార్జున, గోపిచంద్. విక్ట‌రీ వెంక‌టేశ్, అల్ల‌రి న‌రేష్, విజ‌య్ సేతుప‌తి, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అఖిల్ అక్కినేని, సిద్దు జోన్న‌ల‌గ‌డ్డ, శ్రీ విష్ణు, విశ్వ‌క్ సేన్, సాయి దుర్గ తేజ్, నాగా శౌర్య, బాలకృష్ణ ఫేవరేట్ డైరెక్టర్స్, బాలయ్యతో నటించిన హీరోయిన్లు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ యాంకర్ ఝాన్సీ యాంకరింగ్ చేశారు.

 ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం

కాగా 1960 జూన్ 10 బాలకృష్ణ జన్మించారు. పేరు బాలకృష్ణ అయినా… ఇంట్లో అందరూ బాలయ్య అనే పిలుస్తారు. తన తండ్రి ఎన్టీఆర్ సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల… చిన్నప్పటి నుంచి ఆయనతో బాలయ్య గడిపిన సమయం తక్కువనే చెప్పుకోవాలి. 1974లో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు బాలయ్య సినీ ఆరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కించిన ‘తాతమ్మ కల’ చిత్రంలో తొలిసారి బాలయ్య నటించారు. కెరీర్లో కొన్ని డిజాస్టర్లు వచ్చినా తనదైన శైలిలో వాటిని అధిగమించి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగారు. ఇండియాలో 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగిన అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచారు. అటు రాజకీయాల్లోనూ రాజకీయాల్లో సైతం ఓటమి ఎరుగని నేతగా బాలకృష్ణ నిలిచారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళుతున్నారు. “చరిత్ర సృష్టించాలన్నా… దాన్ని తిరగరాయాలన్నా ఆయనకే సాధ్యం” అని అంటుంటారు బాలయ్య అభిమానులు.

 

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *