Khammam: కలకలం.. యాసిడ్ పోసి చంపేస్తానంటూ యువకుడి హల్‌చల్

సమాజంలో రోజురోజుకీ మహిళలు, బాలికలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు(Atrocities against women) జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ(Love) పేరుతో కొందరు, అక్రమ సంబంధాల(Illicit relations) మోజులో పడి కొందరు, డబ్బు(Money) కోసం మరికొందరు ఇలా అనేక విధాలుగా మహిళలు ఏదో ఒకరకంగా వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలోని ఖమ్మం(Khammam) జిల్లాలో ఇలాంటి ఓ ఘటన కలకలం రేపింది.

యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ హల్‌చల్‌

వివరాలు ఇలా.. ఖమ్మంలో ఓ యువకుడు హల్‌చల్‌ చేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రేమించిన యువతిని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తే…యాసిడ్‌(Acid) పోసి చంపేస్తానంటూ ఆ యువకుడు హల్ చల్‌ చేశాడు. ఆ యువకుడి ఉన్మాద చేష్టలకు భయపడిపోయిన బాలిక.. ఆమె తల్లి ఇంటికి గేటుకు తాళం వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. VM బంజరకు చెందిన బొర్రా సాయిమహేందర్‌(
Borra Saimahender) జులాయిగా తిరుగుతున్నాడు. పదోతరగతి వరకు చదివిన సాయి ఆ తర్వాత చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఓ బాలిక(Girl)ను ప్రేమించాలంటూ లేకుంటే చంపేస్తానంటూ కత్తి(Knife)తో బెదిరింపులకు పాల్పడ్డాడు.

గేటుకు తాళం వేసుకుని లోపలే ఉండిపోయారు..

అంతటితో ఆగకుండా ప్రత్యేక తరగతుల(Special Classes) కోసం కాలేజీకి వెళ్లిన బాలికను బయటకు రావాలంటూ సాయి కత్తితో హడావుడి చేశాడు. బయటకు రాకుంటే చంపేస్తానంటూ ఉన్మాదిగా ప్రవర్తించాడు. కత్తితో తన చేతులనే కోసుకుంటూ పిచ్చిగా ప్రవర్తించాడు. బయపడిపోయిన బాలిక ఎలాగోలా ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తల్లికి చెప్పి బోరున విలపించింది. మళ్లీ ఆ ఉన్మాది ఇంటికి వస్తాడేమోనని భయపడిపోయిన తల్లీ, కుమార్తె ఇంటి గేటుకు తాళం వేసుకుని లోపలే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. కొద్దిసేపటకి అక్కడికి చేరుకున్న సాయిమహేందర్‌…ఈసారి యాసిడ్‌ సీసా, కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అమ్మాయికి వేరే పెళ్లి చేస్తే యాసిడ్‌ పోసి చంపుతానంటూ బెదిరించాడు. కాసేపటికి స్పృహతప్పి బాలిక ఇంటి ముందే పడిపోయాడు. సాయి మహేందర్‌తో ప్రాణహాని ఉందని బాధితురాలి తల్లి V.M బంజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *