Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి నది పష్కరాలు

నేటి నుంచి ఈ నెల 26 వరకూ తెలంగాణ(Telangana)లో సరస్వతి నది పుష్కరాలు(Saraswati Pushkaralu) నేటి జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం(Kaleshwaram)లో జరిగే ఈ పుష్కరాల కోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

రోజుకు లక్షకుపైగా భక్తులు వస్తారని అంచనా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. అందుకే, ప్రభుత్వం దీని నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు(Devotees) వస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం రూ.35 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని(Saraswati statue) ఏర్పాటు చేస్తున్నారు.

Konda Surekha Unveils Saraswati Pushkaralu 2025 Poster

పుణ్య స్నానమాచరించిన పీఠాధిపతులు

పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరిస్తారని తెలంగాణ దేవాదాయశాఖ(Telangana Endowments Department) తెలిపింది. మే 15న మెదక్‌ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, 19న నాసిక్‌ త్రయంబకేశ్వర్‌(Trimbakeshwar) మహామండలేశ్వర్‌ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, 23న హంపి(Hampi) విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కరస్నానం ఆచరించనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *