కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Venkateshwara Swamy Temple) దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు(Holidays) కావడం, అటు ఆఫీసులకు వీకెండ్ సెలవులు ఉండటంతో కొండపైన భక్తుల(Devotees) రద్దీ నెలకొంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన టోకెన్లు(Tokens) లేని భక్తులకు దాదాపు 14 గంటల సమయం పడుతోంది. అటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం (Shilathoranam) వరకు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు.

కాగా శుక్రవారం స్వామి వారిని 63,208 మంది భక్తులు దర్శించుకోగా 32,951 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ వేంకటేశ్వరుడికి భక్తసమూహం సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ(Srivari Hundi)కి రూ.3.72 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు(TTD Officials) తెలిపారు.






