బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు(Fanatics in Bangladesh) రెచ్చిపోయారు. ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టు(Hindu female journalist)పై దాడికి పాల్పడ్డారు. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహా(Bangladesh Senior Journalist Munni Saha)ను అల్లరిమూక ఆమెను ఢాకా(Dhaka)లో చుట్టుముట్టింది. సాహా ఒక భారతీయ ఏజెంట్(Indian agent) అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనా(Ex PM Sheikh Hasina)కు మద్దతుదారని వారు ఆరోపించారు. చివరకు పోలీసులు స్పందించి ఆమెను రక్షించారు.
ఆమెను అరెస్టు చేయలేదు: బంగ్లా పోలీసులు
ఆ తర్వాత ఆమెను ఢాకా మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాంచ్(Dhaka Metropolitan Detective Branch) కార్యాలయానికి తరలించారు. దీంతో ఆమెను అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆమెను అరెస్టు చేయలేదని తెల్లవారుజామున విడుదల చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు(Bangladesh Police) వివరణ ఇచ్చారు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు వారు తెలిపారు. పోలీసులు మున్నీ సాహాను అదుపులోకి తీసుకోలేదని.. ఆమె కార్యాలయం వెలుపల ఉన్న కవ్రాన్ బజార్(Kawran Bazar) దగ్గర కొంతమంది వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. తర్వాత భద్రతా కారణాలతో తేజ్ గావ్ పోలీసులు ఆమెను DB కార్యాలయానికి తీసుకెళ్లారని ఓ అధికారి తెలిపారు.
4 కేసుల్లో నిందితురాలు?
ఇదిలా ఉండగా సాహా 4 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని బెయిల్(Bail) కోసం కోర్టుకు హాజరుకావాలని భవిష్యత్తులో పోలీసు సమన్లను పాటించాలని అధికారులు చెప్పారు. కాగా సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరల్‌గా మారిన ఈ దాడి వీడియోలో.. 57మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబధించి ఆమె ప్రజలను తప్పుదారి పట్టించిదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
A prominent Hindu journalist named Munni Saha was arrested by the Bangladesh police from Karwan Bazar in Dhaka.
According to reports, the victim was surrounded by a radical mob after she stepped out of a media office in Janta Tower, Munni was also attacked by the mob. The mob… pic.twitter.com/irDypxCjHX
— Stranger (@amarDgreat) December 1, 2024






